NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకటో తారీకు వస్తుందంటే ప్రతి ఇంట్లో పండగే

1 min read

తెదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర

ప్యాపిలి న్యూస్ నేడు:ప్రతి నెల ఒకటో తారీకు వస్తుందంటే ప్రతి ఇంట్లో పండగే అని జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర అన్నారు. ఈ సందర్భంగా శనివారం డోన్ శాసనసభ సభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణంలోని కిందికేరిలో అర్హులైన వృద్ధులకు, విడువలకు ,వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నడిగడ్డ నాగేంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి ఇంటికి అందడంతో ఆ ఇంటి వాతావరణం పండగ వాతావరణంలా నెలకొంది ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి ఇంటిలో ఆసరాగా ఉంటూ భరోసా ఇస్తుందని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ద్వేయంగా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు అర్హులైన పింఛన్ దారులు తదితరులు పాల్గొన్నారు.

About Author