NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

ప్రతి రైతునూ ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశం..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ ​నేడు  : ప్రతి రైతునూ ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మహిళా మండలి సమాఖ్య ప్రాంగణంలో ఎన్ సి సిఎఫ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్క్ షెడ్ డిఎం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కనీసం మద్దతు ధర క్వింటాలు శనగలు ధర-5,875..కందులు 8 వేలకు కొనడం జరుగుతుందని కొనుగోలు కొరకు రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలను ఖరీఫ్ లో పంటలు మార్పిడి చేస్తే పంట అధికంగా దిగుబడి వస్తుందని తలముడిపిలో రేపు సోమవారం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని రైతులు హార్టికల్చర్ పంటలను వేయాలని అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ గండి పూర్తి చేస్తామని మరియు మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తామని అన్నారు. అన్నారు.ముందుగా ఉదయంకడుమూరు,49 బన్నూరులో పింఛన్లు మరియు సీఎం ఆర్ఎస్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి,ఏడిఏ గిరీష్,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,ఏవో పీరు నాయక్,వంగాల శివరామిరెడ్డి,సొసైటీ సీఈవో మల్లికార్జున,గోవర్ధన్ రెడ్డి ఇద్రిస్,సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి,గోకారి,రామస్వామి రెడ్డి పాల్గొన్నారు.

About Author