NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేరనికి గ్రామంలో 50 లక్షలతో సిసి రోడ్ పనులు

1 min read

హోలగుంద న్యూస్ నేడు: నేరనికి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇంచార్జ్ వైకుంఠ జ్యోతి ఆధ్వర్యంలో రూ. 50 లక్షల వ్యయంతో సిసి రోడ్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో బురద, గుంతలు మరియు నీరు నిల్వ ఉండడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని సిసి రోడ్ నిర్మాణం చేపట్టారు.ఈ పనులు పూర్తయ్యాక గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీర నాగప్ప, జిల్లా ఆరు రీజియన్ సెక్రటరీ మల్లికార్జున, సర్పంచ్ సోమప్ప, గిరప్ప, సుధా మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు.

About Author