ఏపీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫారం ఆధ్వర్యంలో సైన్స్ ‘డే’ కార్యక్రమం
1 min read

విద్యార్థులకు సైన్స్ పట్ల జిజ్ఞాస పెరిగేలా ఉపాధ్యాయులు బోధించాలి
జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి ఏ.సర్వేశ్వరరావు
ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు సన్మాన సత్కారం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యార్థులలో సైన్స్ పట్ల ఉత్సాహం పెరిగే విధంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి ఏ.సర్వేశ్వరరావు అన్నారు. స్థానిక సుబ్బమ్మ దేవి హై స్కూలులో మంగళవారం ఏపీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫారం ఆధ్వర్యంలో సైన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేశ్వరరావు మాట్లాడుతూ బట్టి చదువులకు స్వస్తి చెప్పి సైన్సు సబ్జెక్టును విద్యార్థులు తార్కికంగా నేర్చుకోవాలని అన్నారు.తొలుత భారతీయ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, కొయ్యలగూడెం,నూజివీడు డివిజన్ లలో కలిపి మొత్తం 15 మంది బైలాజికల్ సైన్స్ సబ్జెక్టులో ఉత్తమ సేవలు అందిస్తున్న బయోలాజికల్ సైన్స్ టీచర్లను శాలువా కప్పి , పూల బొకేలు అందించి, మెమోటో అందించి ఘనంగా సత్కరించి సన్మానించారు.కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎంవో రామారావు, జిల్లా సైన్సు అధికారి సోమయాజులు, బయోలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.ధనుంజయ, డి.గంగాధర్,గౌరవాధ్యక్షులు బి.వి రావు, సుబ్బమ్మ దేవి హై స్కూల్ హెచ్ఎం కుటుంబరావు, నిడమర్రు హై స్కూల్ హెచ్ఎం నరేష్ తదితర ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంచేశారు.


