ప్రయాణికులకు కల్తీ పాలు విక్రయించొద్దు…
1 min read
కల్తీ పాలు, ఖనిజాలు లేని నీరు అమ్మితే చర్యలు తప్పవు
- ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్ రావు
కర్నూలు , న్యూస్ నేడు: ప్రయాణికులకు కల్తీ పాలు, ఖనిజాలు లేని నీరు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్ రావు. గురువారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు, ఆర్టీసీ ఆవరణలోని దుకాణదారులకు కల్తీ పాలు, నీరు పై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర డైరెక్టర్ , ఆహార భద్రత కమిషనర్ , మంగళగిరి ఆదేశాల మేరకు ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు నేతృత్వంలో ఆహార భధ్రత జిల్లా ఉన్నతాధికారి కుర్మా నాయక్ సమక్షంలో కల్తీ పాలు, మినరల్ వాటర్, పాలు కల్తీవా కదా… తెలుసుకునేందుకు చేయాల్సిన ప్రాథమిక చర్యలు తదితర అంశాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆహార భద్రత జిల్లా అధికారి రాజ గోపాల్ రావు మాట్లాడుతూ పాలలలో యూరియా, సోడియం, స్టాచ్ కలిపితే వచ్చే ఫలితాల గురించి ప్రయోగం ద్వారా క్షుణ్ణంగా వివరించారు. మినరల్ వాటర్ లో 70 శాతం పైగా ఖనిజాలు ఉండే వాటర్ బాటిళ్లు విక్రయించాలని, కొన్ని దుకాణాలలో 58 శాతం, మరికొన్ని 62శాతం మినరల్ ఉండే వాటర్ ను విక్రయిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. మరోసారి వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో విక్రయించే వాటర్ బాటిళ్లు, పాలను తనిఖీ చేస్తామని, అప్పుడు కల్తీ అయిందని తేలితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్ రావు హెచ్చరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సంధ్యారాణి, కంజ్యూమర్ జిల్లా సెక్రటరి శివ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


