కేడీసీసీబీ నూతన సీఈఓ కొమ్మ శివలీల
1 min read
కర్నూలు, న్యూస్ నేడు :కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్యకార్యనిర్వహణాధికారిగా కొమ్మ శివలీల గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న ఇంచార్జి ముఖ్యకార్యనిర్వహణాధికారి పి. రామాంజనేయులు నుండి పదవీ భాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ శివలీల మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులు పూర్తి స్థాయిలో సహకరించాలని, ముఖ్యంగా నిరర్ధక ఆస్తులు (NPA) తగ్గించడములో ప్రత్యేక దృష్టి, సారిస్తామని తెలిపారు. మొండి బకాయిల ఋణ వసూళ్ళు వేగవంతము చేసి బ్యాంకు యొక్క ఆర్థికస్థితిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లాలో రైతులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక సేవలు అందించడములో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కీలకపాత్ర పోషించాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచి సీఈఓ పదవి బాధ్యతలు అప్పగించిన చైర్మన్ రాజా విష్ణువర్ధన్ రెడ్డి కి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

