NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం

1 min read

చిన్నతనం నుండే బాలికలను యోగ సాధన వైపు ప్రోత్సహిద్దాం

కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శమంతకమణి

కర్నూలు, న్యూస్​ నేడు:  మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శమంతకమణి అన్నారు. శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి ఉమెన్స్ యోగ ప్రీమియర్ లీగ్ పోటీలను జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగం,జిల్లా క్రీడాల అభివృద్ధి అధికారి  భూపతిరావు,జిల్లా సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసలు, న్యూట్రిషన్ సునీత తో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ  సందర్భంగా కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శమంతకమణి మాట్లాడుతూ చిన్నతనం నుండే బాలికలను యోగ సాధన వైపు ప్రోత్సహిస్తే ఒత్తిడిని అధిగమించి తాము అనుకున్న రంగంలో రాణించి దేశానికి సేవ చేస్తారన్నారు.అనంతరం  ముంతాజ్ బేగం, భూపతిరావు లు  మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుంచి అనేకమంది బాలికలు రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీయ స్థాయి  పోటీలలో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని అన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని యోగా క్రీడాకారులు చేసి చూపారని అన్నారు. బాలికలతో పాటు మహిళలను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. అనంతరం యోగా రంగంలో విశిష్ట సేవలు అందించిన మహిళ శిక్షకులను ఘనంగా సత్కరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు 170 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి,ముని స్వామి,ఉమ్మడి జిల్లాల యోగ సంఘం సభ్యులు గంగాధర్,లాలన ప్రియ,నివేదిత,అక్బర్, శిక్షావలి,విజేత వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author