NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1 min read

స్త్రీలకు స్వేచ్ఛ స్వతంత్రాలు కుటుంబ ఆర్థిక ప్రగతికే కాకుండా దేశ అభివృద్ధికి తోడ్పడతాయి

 కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:గుత్త గిరిబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ ప్రెస్ నోట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  శనివారం మధ్యాహ్నం కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం* ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానా చార్యులు డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షత వహించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ గివ్ టు గెయిన్ నినాదాన్ని ఉటంకిస్తూ స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు  కుటుంబ ఆర్థిక ప్రగతికే కాకుండా దేశాభివృద్ధికి తోడ్పడతాయన్నారు. వైస్ ప్రిన్సిపల్ కే అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన  సాధించిన స్త్రీ అన్ని రంగాల్లోనూ ముందుంటుందన్నారు.అనంతరం మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ టీవీఎస్ పద్మావతి మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ స్త్రీ సాధించిన ప్రగతిని వివరిస్తూ, అధిగమించవలసిన సవాళ్లను కూడా పేర్కొన్నారు.అనంతరం వివిధ విభాగాల అధ్యాపకులు వి వెంకట్రావు, డాక్టర్ ఎం రాంబాబు,ఎస్ పరమేశ,ఎం కృష్ణ చైతన్య,టి వెంకట దుర్గాప్రసాద్,డా. పిఆర్ కావ్య శ్రీ, డి.సుజాత ప్రసంగించారు.అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన  పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో  అధ్యాపకులు జె మధుసూదన రావు అధ్యాపకేతర సిబ్బంది ఎస్ విజయ రాణి,కే లక్ష్మీ కుమారి,కె నాగవేణి  పాల్గొన్నారు.

About Author