NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానసిక ఉల్లాసానికి హ్యాపీ సండే

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు, న్యూస్ ​నేడు: ఆదివారం ప్రజలు తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆనందంగా గడపడం, ఆరోగ్యంగా ఉండడం కోసమే ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. ఆదివారం బిర్లా కాంపౌండ్‌లోని ఖానా-ఖజానాలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు స్టెప్పులు వేశారు. చిన్నారులు యోగా ఆసనాలు వేశారు. మను, శ్రీ,కృష్ణ ప్రియ, సాత్వికులు చేసిన అడ్వాన్స్ యోగ వ్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రతిరోజూ పనుల ఒత్తిడిలో ఉంటారని, అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం ఉల్లాసంగా గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. హ్యాపీ సండే వంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, డిఈఈ నరేష్, శానిటేషన్ ఇంస్పెక్టర్ రాజు, సిబ్బంది శ్రీదేవి, శోభారాణి, కావ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author