కంటికి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ శుభాకాంక్షలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ మీటింగ్ హాల్ లో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించినారు.ఈ కార్యక్రమములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడరు. స్త్రీ లేకపోతే జననంలేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అమ్మను గౌరవించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళలను గౌరవించాలని తెలిపారు. కంటికి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రస్తుతం సమాజంలో అన్నీ రంగాల్లో రాణిస్తున్నారని విద్యా,వైద్య వ్యాపారాలు,క్రీడలు, రాజకీయాలు , అంతరిక్షం, టెక్నాలజీతో పాటు ఇంటి భాద్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు,కళాశాలల్లో విద్యార్థులకు సంపూర్ణ పోషకాహారం అందిస్తూ రక్త హీనత నివారించే చర్యలు తీసుకుందని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే అన్నివిధాల దేన్నైనా సాధించగలరని, పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం చేయడం ద్వారా రక్తపోటు, షుగర్ లాంటి జబ్బులు దరిచేరవని తెలిపారు. మహిళలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని, 35 సంవత్సరములు దాటిన మహిళలు పాప్ స్మియర్, మమ్మోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలని సూచించినారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.భాస్కర్ గారు పరిపాలన అధికారిని అరుణ ,వ్యాధినిరోధక టీకాల అధికారిణి డాక్టర్.ఉమా ,డాక్టర్.మంజుశ ,డిప్యూటి డెమో షఫీ ఉన్నిస మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్.కార్తిక లక్ష్మి ని శాలువా,పూల దండలతో సత్కరించినారు. ఈ కార్యక్రమములో మహిళా ఉద్యోగులు మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

