లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ శాంతి, సమానత్వం మరియు మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచ శాంతి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎంపైర్ ఆఫ్ పీస్ మైక్రో నేషన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందించే ఈ -సిటిజన్ షిప్ సభ్యత్వం గుర్తింపు కార్డును హెచ్.ఆర్.ఎం ఎంపరర్ ప్రొఫెసర్ లారెన్స్ ఓకే విర్ కర్నూల్ కు చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు నేడు అంతర్జాలం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యుద్ధాలు కుటుంబాలను విచ్చిన్నం చేయడమే కాకుండా లక్షలాదిమంది అమాయక ప్రజలపై ప్రభావం చూపిస్తాయని, ఆర్థిక సంక్షోభన్ని సృష్టిస్తాయి అని అటువంటి క్లిష్టమయిన సమయంలో యూ. ఎన్. ఓ జోక్యం చేసుకో్వాలని ఐక్యరాజ్యసమితి ద్వారా వివాదాస్పద దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి మార్గాన్ని అందించేలా కృషి చేయాలని అంతర్జాతీయ సంస్థల ద్వారా ఐక్యరాజ్యసమితికి విన్నపాన్ని పంపించనున్నమన్నారు.

