స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గుడిసె కృష్ణమ్మ సేవ సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆదోని మండల పరిధిలోని మంత్రికి గ్రామంలో మంగళవారం “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణమ్మ సేవా సైన్యం వాలంటీర్లతో కలిసి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం ముందు, అలాగే ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో స్వయంగా చీపురు పట్టి పరిశుభ్రం చేశారు.ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, రోగాలు దరిచేరవని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గుడిసె శ్రీరాములు, కొత్తూరు సర్పంచ్ నాగరాజ్, అంబేద్కర్ సొసైటీ చైర్మన్ జాలమంచి రంగస్వామి, మాజీ ఎంపీపీ మురళి, మాజీ సర్పంచ్ మాదవ్, బైచిగేరి ఓంకార్, గోపాల్, మంత్రికి ముని, వెంకటేష్, రామాంజిని నాగేంద్ర మహదేవ సాదిక్ వలి, రాఘవరెడ్డి, బల్లెకల్ బసవరాజ్, సవారయ్య, బంగారు బాబు, కాసిం అశోక్, చిట్టి పెద్ద చిట్టి చంద్ర వీరేష్ విజయ్ భరత్ గంగాధర్ రంగస్వామి తిమ్మప్ప గిడ్డయ్య దొడ్డిన గిరి గజేంద్ర ఆర్ఎంపి భాష, విద్య కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, ఈరన్న, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.“మాటలకే పరిమితం అయ్యే నాయకులు చాలా మంది ఉంటారు… కానీ ప్రజల మధ్యకి వచ్చి సేవ చేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీదే.”“పరిశుభ్రమైన సమాజం కోసం చేతులు కలిపితేనే అభివృద్ధి సాధ్యం… అదే మా పార్టీ నమ్మకం.”

