ఆహార కల్తీ అవగాహన అవసరం
1 min read

జిల్లా ఆహార భద్రతాధికారి టి.రాజగోపాల్
కర్నూలు, న్యూస్ నేడు: క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలు పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు కర్నూలు నందు కళాశాల రసాయన శాస్త్ర విభాగం అధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.ఇందిరాశాంతి గారి అధ్యక్షతన “ఆహార భద్రతా అవగాహన” పై సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఆహార భద్రతాధికారి టి.రాజగోపాల్ హాజరయ్యారు. అధ్యక్షోపాన్యాసంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మనం తనే ఆహారం మనకు శక్తిని, ఇస్తుందని అది కల్తీ అయినట్లయితే శాపంగా మారుతుందని తెలిపారు. ముఖ్య అతిథి టి.రాజగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం మానవులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ అని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అంతేగాక పెద్ద హోటల్స్ లో మరియు రోడ్డుప్రక్కల బండ్లపై పెట్టే ఆహారాలు తినడం మానుకోవాలని ఇంటి భోజనమే శ్రేయస్కరమని తెలిపారు. వివిధ రకాల ఆహార కల్తీకి పాల్పడిన వ్యాపారులకు విధించే శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. . కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జె. హేమంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంటినుండి ఆహారం తెచ్చుకోవాలని హితవు చెప్పారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మరియు రసాయన శాస్త్ర విభాగాధిపతి ఎ. సత్యనారాయణ మాట్లాడుతూ సూపర్ మార్కెట్లలో నిల్వ చేసిన ఆహారం పట్ల అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలకు తినిపించే బిస్కెట్లు చాక్లెట్ వంటివి ఆహారాలు వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు అవరోధంగా మారుతాయని తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


