ఘనంగా మాచునూరు ఊరిదేవర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో
1 min read

– ముఖ్య అతిథులుగా వైకుంఠ జ్యోతి, గోవింద్ గౌడ్
ఆలూరు న్యూస్ నేడు:హాలహర్వి మండలం మాచునూరు గ్రామంలో నిర్వహించిన ఊరిదేవర ఉత్సవాలు గ్రామ ప్రజల భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ ప్రజల ఆత్మీయ ఆహ్వానం మేరకు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠ జ్యోతి, టిడిపి పడుగుంద మండలం ప్రధాన కార్యదర్శి ఈ.బి.జి. గోవింద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ సంప్రదాయాలు, సంస్కృతి మరియు ఊరిదేవర ఉత్సవాలు గ్రామ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, భక్తిని మరింత బలపరుస్తాయని తెలిపారు. గ్రామ దేవత కటాక్షంతో ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడిన నాయకులు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గ్రామ మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.


