విభిన్న ప్రతిభావంతురాలికి మూడు చక్రాల బ్యాటరీ వాహనం అందజేత
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శారీరక విభిన్న ప్రతిభావంతురాలు అయిన కుమారి పెండ్యాల సహస్ర, జంగారెడ్డిగూడెం వారికి మూడు చక్ర్రాల బ్యాటరీ వాహనము ఉచిత పంపిణీ కుమారి పెండ్యాల సహస్ర, తండ్రి : శ్రీ పెండ్యాల సుందర రావు, జంగారెడ్డిగూడెం వారు శారీరక విభిన్న ప్రతిభావంతురాలు అనియు, వారికి మూడు చక్రాల బ్యాటరీ వాహనము మంజూరు చేయవలసినదిగా కోరుచూ ముఖ్య మంత్రి కార్యాలయమునకు అర్జీ సమర్పించుట జరిగినది. సదరు శారీరక వైకల్యముతో బాధపడుచున్న శారీరక విభిన్న ప్రతిభావంతురాలు అయిన కుమారి పెండ్యాల సహస్ర, జంగారెడ్డిగూడెం వారికి జిల్లా కలక్టర్ మూడు చక్రాల బ్యాటరీ వాహనము కొనుగోలు నిమిత్తం నిధులు రు.60,000/- మంజూరు చేసి అలిమ్కో, హైదరాబాదు ద్వారా మూడు చక్రాల బ్యాటరీ వాహనము తెప్పించి జిల్లా కలక్టర్ చేతుల మీదుగా మూడు చక్ర్రాల బ్యాటరీ వాహనము ఉచిత పంపిణీ చేయుట జరిగినది.విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి.రవికుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.

