వ్యాక్సినేషన్ కార్యక్రమం పర్యవేక్షణ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హెచ్.పి.వి(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు (11.03.2026) పర్యవేక్షించడానికి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ఉమా డాక్టర్స్ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, హెచ్.పి.వి(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ స్టాక్ స్టేటస్ న్ను పరిశీలించారు. అక్కడి నుంచి అరోరా సచివాలయం సందర్శించి రెగ్యులర్ Antenatal Clinic మరియు టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి ఇంటింటి సర్వే చేసి, 14 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను గుర్తించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీఎస్సీ)లో వ్యాక్సినేషన్ చేయించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఈ.ఓ (HEEO) శ్రీ. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.

