NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోళ్లపాడు’లో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

మిడుతూర్ ఎస్సీ కాలనీ అభివృద్ధికి కృషి..

న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): గ్రామాల్లోపశువులకు ఎలాంటి రోగాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో గురువారం ఉదయం నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ముందుగా పశు వైద్యాధికారులు డాక్టర్ సాయినాథ్ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.పశువులకు ఎమ్మెల్యే టీకాలు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పశువులకు ట్యాగింగ్ చేయుంచుకోవాలని పశువులకు గాలి కుంటు టీకాలు వేయిస్తే పశువులకు వ్యాధులు రాకుండా నివారించవచ్చని అన్నారు.రైతులకు మందులను పంపిణీ చేశారు.తర్వాత మిడుతూరు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాల్వను పరిశీలించి రోడ్డు కంటే ఇండ్లు తక్కువగా ఉండడంతో చిన్నపాటి వర్షానికే ఇండ్ల మధ్యన నీళ్లు నిల్వ ఉంటూ ఉన్నాయని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.ఊరి బయటగోడ కట్టి ఆ తర్వాత ఇండ్ల మధ్యన నీళ్లు సక్రమంగా వెళ్లేందుకు ఎత్తు పెంచాలని పి ఆర్ఏఈ ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ రామ స్వామి రెడ్డి,వంగాల శివరామి రెడ్డి,సుధాకర్ రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,శబ్బు,నరసింహ గౌడ్ పాల్గొన్నారు.

About Author