కెనరా బ్యాంకు ‘ ఏఐబిఈఏ’ ను బలోపేతం చేద్దాం..
1 min read

సెంట్రల్ కమిటీ మెంబెర్ మోహన్
కర్నూలు, న్యూస్ నేడు : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల హక్కులు, డిమాండ్ల సాధనకు కృషి చేయడంతోపాటు కెనరా బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ( ఏఐబిఈఏ ) ను మరింత బలోపేతం చేస్తామన్నారు సెంట్రల్ కమిటీ మెంబరు మోహన్. బుధవారం నగరంలోని హౌసింగ్ బోర్డు కెనరా బ్యాంకు బ్రాంచ్లో ఏఐబిఈఏ ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబెర్ కామ్రేడ్ మోహన్, రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ రాముడు,కమిటీ మెంబెర్ కామ్రేడ్ U కిరణ్ కుమార్ మహిళా వింగ్ కన్వీనర్ కామ్రేడ్ రాజా హరిణి మాట్లాడుతూ కెనరా బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు సాధించామని , బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. పూర్వపు సిబిఈయూ ఏపీ నాయకులు మరియు కమిటీ సభ్యుల చేసిన చిరస్మరణీయమన్నారు. వారి అడుగు జాడల్లో నడూస్తూ కెనరా బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో నాయకులు శివానంద ప్రసాద్, మధు కుమార్, మస్తాన్ వలి, సతీష్,వీరశేఖర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మెమోంటోలు అందజేశారు.


