కాఫీ షాప్ ను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు
1 min read

ఎస్టీ కమిషన్ సభ్యులు పివిపి వెంకటప్ప..
న్యూస్ నేడు నందికొట్కూరు: కర్నూలు జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ షాప్ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వి.పి వెంకటప్ప శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తూ మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అరకు ప్రాంతంలో పండే కాఫీకి దేశ విదేశాల్లో మంచి గుర్తింపు ఉందని,గిరిజన రైతులకు ఆదాయం పెరగడానికి ఇలాంటి కాఫీ షాపులను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పివిపి వెంకటప్పను అరకు వ్యాలీ కాఫీ షాప్ బ్రాంచ్ నిర్వాహకులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ప్రజా రామరాజు,మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసారపు వెంకటేష్,జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి.సురేష్,జిల్లా బాండెడ్ లేబర్ కమిటీ సభ్యులు యోగేష్ నాయక్, ఎస్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండాల నాయక్, ఎన్టిఎఫ్ నాయకులు కుశల అన్న, అరకు వ్యాలీ కాఫీ షాప్ నిర్వాహకులు స్వామి,దాసు, నాగేంద్ర,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


