నాణ్యమైన ఆహారంతోనే కీళ్లు, ఎముకలు పటిష్టం
1 min read

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి
ప్రజల ఆరోగ్యంపై లీ ఫార్మా, లీ డోమైన్ హెల్త్ ప్రత్యేక దృష్టి
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి
విశాఖపట్నం, న్యూస్ నేడు: ప్రజలు అగోగ్యకరమైన జీవనం సాగించాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని, ఎముకలు గట్టి పడేందుకు నాణ్యమైన పదార్ధాలు తీసుకోవాలని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి అన్నారు. ప్రజలకు మేలు చేయడమే ధ్యేయంగా లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ సంయుక్తంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షాపింగ్ మాల్‌తో కలిసి శుక్రవారం మాల్ ఉద్యోగుల కోసం ఉచిత ఎముకలు, కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ వైద్య శిబిరం ద్వారా 100 మంది లబ్ధి పొందారు వీరికి హ్యాండ్ గ్రిప్, బిఎంఐ, హెచ్.బి, ఆర్.బి.ఎస్, బిపి, ఎముక ఖనిజ సాంద్రత, బాడీ కంపోజిషన్ వంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం డాక్టర్ మరియు న్యూట్రిషనిస్ట్ నివేదికలను పరిశీలించి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి మాట్లాడుతూ కీళ్లు, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం, తగినంత నిద్ర, పోషకాలతో కూడిన ఆహారం తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. కీళ్లు, ఎముకలు ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్లుగా సరోజిని, జయలక్ష్మి, డాక్టర్ రావుబాబు, న్యూట్రిషనిస్టులు మాధురి, క్రాంతి, జీఎన్ఎం భాగ్యలత, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ నవీన్, లీ ఫార్మా ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


