గురురాజాలో అట్టహాసంగా ప్రీ నర్సరీ ముగింపు వేడుకలు
1 min read

నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రెండున్నర సంవత్సరాలు నిండిన చిన్నారులకు ప్రీ నర్సరీ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకలకు శ్రీ గురురాజా పాఠశాల సలహాదారులు శ్రీమతి పి. సింధు , శ్రీమతి పి. రేవతి ముఖ్య అతిథులుగా హాజరయ్యూరు. ఈ కార్యక్రమంలో ప్రీ నర్సరీ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారుల విచిత్ర వేషధారణలు, దేశ నాయకుల ఫ్యాన్సీ డ్రెస్, రైమ్స్ స్టోరీస్, నంబర్ గేమ్స్, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ఆడుతూ, పాడుతూ ప్లే వే మెథడ్ లో యాక్టివిటీ బేస్డ్ విధానంలో ప్రీ నర్సీరీ ఉపాధ్యాయుల శిక్షణ అందించగా విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమానికి స్కూల్ సలహాదారులు శ్రీమతి సింధు , శ్రీమతి రేవతి ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల ప్రతిభ పాటలను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


