NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవతా సేవా సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయం

1 min read

విజయరాయి హెచ్ ఎం బి పద్మజ

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని పెదవేగి మండలం విజయరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి పద్మజ పేర్కొన్నారు. విజయరాయి ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రముఖ సంఘ సేవకురాలు, మానవతా సంస్థ సభ్యురాలు ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం పద్మజా మాట్లాడుతూ విజయరాయి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు అందుతున్నాయని ఈ సందర్భంగా మానవతా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. అలాగే మానవతా సంస్థ సభ్యురాలు కోనేరు అమరవాణి మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మానవతా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆమె అన్నారు. విద్యార్థులకు అందజేసే పరీక్షా కిట్లను గుత్త చిత్త రంజన్ దాస్, శ్రీకృష్ణ భారతీ మణి ట్రస్ట్ ఆధ్వర్యంలో బహూకరించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు సూర్యప్రకాష్, శ్రీనివాస్, మోహిని,కనకదుర్గ, ప్రభ తదితరులు పాల్గొన్నారు.

About Author