నూతనంగా వాటర్ ట్యాంక్ ట్రయల్ రన్ …పూజా
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో వాటర్ గ్రిడ్ పథకం లో భాగంగా గోరుకల్ రిజర్వాయర్ నుండి జలదుర్గం గ్రామానికి శుద్ధి చేయబడిన తాగునీరు అందించేందుకు నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ట్రయల్ రన్ మరియు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా జలదుర్గం గ్రామ ప్రజలకు నిరంతరంగా నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలో నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, తేదేపా నాయకులు ఆర్ ఇ నాగరాజు, బిజెపి నాయకులు కెసి మద్దిలేటి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

