రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం: ఎమ్మెల్యే కోట్ల
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఎన్ రంగాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల గురించి ఈ సందర్భంగా వివరించారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, ముఖ్యంగా పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను ఎమ్మెల్యే రైతులకు వివరించారు. అదనంగా రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సరఫరా విధానాలపై సమగ్ర సమాచారం అందించారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్, తేదేపా నాయకులు ఆర్ ఇ నాగరాజు, ఆర్ సి.మద్దిలెటి,సుంకన్న గ్రామ రైతులు,కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

