ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం…
1 min read

– ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తాం…
– రాష్ట్ర మంత్రి టి.జి.భరత్
– రెండున్నర కోట్ల తో అవుట్డోర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకు స్థాపన
కర్నూలు , న్యూస్ నేడు : క్రీడాకారులు , వాకర్స్ అసోసియేషన్ కోరిక పై స్టేడియంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. గురువారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం లో పికిల్ బాల్ కోర్టులు , వాలీబాల్ కోర్టులు మరియు వాకింగ్ ట్రాక్ లను రెండున్నర కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ ఫ్లోరింగ్ చేయించే కార్యక్రమాలకు మంత్రి టి. జి.భరత్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నేను గతంలో ఇదే స్టేడియంలో క్రీడలు ఆడటానికి వచ్చేవాడినని , మా వంశం క్రీడల పట్ల చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేస్తున్నదన్నారు. భవిష్యత్ ఛాంపియన్‌లను తీర్చిదిద్దేందుకు మరియు మన యువతకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించేందుకు, కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేసి కనీసం 40 శాతం క్రీడల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టిడ్కో గృహ సముదాయ సమీపంలో గ్రీన్కో కంపెనీ వారు నిర్మిస్తున్న స్టేడియం త్వరలో పూర్తి అవుతుందని , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర కూడా స్టేడియం పూర్తి చేయిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు , కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు కార్యక్రమంలో కర్నూల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ , డిఎస్డివో భూపతిరావు , హజ్ కమిటీ మైంబర్ మన్సూర్ అలీ ఖాన్ , ఎమ్ ఎస్ ఎం ఈ డైరెక్టర్ కౌశిక్ , నాయకులు సి టి నాగరాజు , ప్రవీణ్ , గాజుల భాస్కర్, స్టేడియం సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.

