శ్రీశైలంలో కల్తీ ఆహార పదార్థాలకు చెక్..
1 min read

నిషేధిత రంగు కలిపిన బఠాణీ, గోబిమంజూరియా, షుగర్ క్యాండిల్ తొలగింపు
- ఫుట్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలతో బెంబేలెత్తిన హోటళ్ల యజమానులు
కర్నూలు , న్యూస్ నేడు:శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వెలిసిన శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆహార భద్రత శాఖ డైరెక్టర్, ఆహార భద్రత జిల్లా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఆహార భద్రత అధికారి కర్నూలు రాజగోపాల్ రావు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ వైపు వెళ్లే రహదారిలోని హోటళ్లు, బస్టాండ్ ఆవరణంలోని హోటళ్లు, గోబి మంజూరియా, బఠాణి షాపులను పరిశీలించారు. నిషేధిత రంగు కలిపిన బఠాణీలు కొందరు విక్రయిస్తుండగా…సింథటిక్ రంగు కలిపిన గోబి మంజూరియా, షుగర్ క్యాండిల్ విక్రయించే వారు, కాల్చిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించే వారిని గుర్తించి… వారి నుంచి బఠాని, గోబి మంజూరియా, షుగర్ క్యాండిల్‌ను చెత్త బుట్టలో వేయించారు. దీంతో శ్రీశైలంలోని హోటళ్ల యజమానులు, తినుబండారాలు విక్రయించే వారు, గోబి మంజూరియా యజమానులు ఆందోళనకు గురయ్యారు. భవిష్యత్ లో కల్తీ ఆహారం, కలుషిత నీరు ఎవరు విక్రయించినా చర్యలు కఠినంగా తీసుకుంటామని ఆహార భద్రత అధికారి కర్నూలు రాజగోపాల్ రావు ఈ సందర్భంగా హోటళ్లు, గోబి మంజూరియా యజమానులను హెచ్చరించారు.


