నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి
1 min read

నగరపాలక ప్రత్యేక అధికారిణి, జిల్లా కలెక్టర్ ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని జిల్లా కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కర్నూలు నగరపాలక సంస్థ పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. పన్ను వసూళ్ల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌యస్, బిపియస్ పథకాల అమలు స్థితిపై ఆరా తీశారు. అభివృద్ధి పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని, వేసవిలో తాగునీటి సరఫరాపై పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ యన్.చిన్నరాముడు, ఎస్‌ఈ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

