ఒంటెద్దు బండ్ల పోటీల విజేతలకు బహుమతి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉగాది పండుగను పురస్కరించుకొని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఒంటెద్దు బండ్ల పోటీల విజేతలకు మంత్రి టీజీ భరత్ బహుతులు ప్రధానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన ఒంటెద్దు బండికి టీజీవీ సంస్థల తరుపున రూ.50వేల చెక్కును మౌర్య ఇన్‌లో అందించారు. రెండవ బహుమతిని మార్కెట్ యార్డు సెక్రటరీ జయలక్ష్మి 6 తులాల వెండి, మూడవ బహుమతిని మార్కెట్ యార్డు ఛైర్మన్ గోల్కొండ అజ్మద్ బీ రూ.10వేలు అందించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు బండ్ల యజమానులు మంత్రి టీజీ భరత్‌కు కృతజ్ణతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు మారుతి శర్మ, సువర్తమ్మ, నాయకులు రాజశేఖర్ రెడ్డి, యేసు, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

