NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట

1 min read

సీఎం చంద్రబాబు  మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం

మంత్రాలయం న్యూస్ నేడు :  మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరుగుతుందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని ఈద్గ లో ప్రార్థన లో ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరియు పరస్పర గౌరవం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రంజాన్ అంటే శాంతి సహనం అని తెలిపారు. అందరూ అల్లా చూపించిన మార్గం లో నడవాలని సూచించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు గాజుల బాష, సాబ్ జాన్, ఖాజాహుశేన్ తాత, పింగాణి ఖాజా, బేల్దారు మాబాష, జామీయ మసీదు కమిటీ సభ్యులు సాబువలి, అక్బర్ వలి, అండే బాష మహమ్మద్ రఫీ, నూర్, రసుల్, ఖాజ రఫి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం ఎస్సై మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

About Author