ధర్మాచరణము ద్వారా పాపము నశిస్తుంది
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే
మన్నెగుంటలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
కర్నూలు, న్యూస్ నేడు: మానవజాతి మనుగడకు ధర్మాచరణమే ఆధారమని, ధర్మాన్ని ఆచరిస్తే సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడని, ఇహమునందు, పరమునందు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడని, అటువంటి ధర్మాచరణ ప్రతి మానవుడి కర్తవ్యం కావాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో క్రిష్ణగిరి మండలం, మన్నెగుంట గ్రామంలోని శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. స్వాత్మానందస్వామి మరియు తెలుగు పండితులు డాక్టర్ ఎం.మధుసూదనాచార్యులు చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను పరవశింపచేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానములనుండి ఏర్పాటు చేసిన ఈ ధార్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజలలో ఎంతో భక్తి భావనను కలిగించాయని భారతీయ జనతా పార్టీ క్రిష్ణగిరి మండల అధ్యక్షులు సి. రామలింగం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచారకులు బోయ వేంకటేశ్వర్లు, చిందుకూరి నడిపి వెంకటేశ్వర్లు, సి. రాముడు, కూరాకుల రాముడు, చిన్న హనుమంతు, పూల వెంకటేశ్వర్లు, పెద్దకురువ బజారి, కె. వెంకటేశ్వర్లు, పూజారి చిందుకూరి వెంకట రాముడు, బోయ చంద్రన్న, లక్ష్మీదేవి, వి.రాముడు, కె. సుంకన్న,కె. లచ్చప్ప, కె. నాగరాజు, మరియు భజన మండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


