ఘనంగా ప్రపంచ జల దినోత్సవ వేడుకలు”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బి. క్యాంపు నందు గల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్ నందు జిల్లా న్యాయసేవాదికారసంస్థ, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, లయన్స్ క్లబ్ అఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ మాట్లాడుతూ నీటి ప్రాధాన్యత దాని సంరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం గా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగానీటికి సంబంధించిన సమస్యలను గుర్తించడం తోపాటు నీరు, పారిశుద్ధ సంక్షోభాన్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో “నీటి కాలుష్య నివారణలో యువత పాత్ర మరియు వినియోగదారుల హక్కుల పై” నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను, షిల్డ్ లను డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ చేతుల మీదుగాప్రదానం చేసారు . ఈ సదస్సులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా ప్రశాంతి, వైస్ ప్రిన్సిపల్స్ హేమంత్, సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనాలసిస్ట్ ఇమ్రాన్ మరియు బిపిఓ పవన్, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ ఫక్రున్నీసా బేగం, గవర్నమెంట్ వోకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగ స్వామి నాయక్, కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ నాగన్న, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ నాగరత్నమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

