NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎప్పటికప్పుడు అందివస్తున్న నూతన సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. ఐఐటి హైదరాబాద్, ట్రీపుల్​ఐటిడీఎం కర్నూలు సంయుక్త భాగస్వామ్యలో ఈ నెల 23 వతేదీనుండి 27వ తేదీవరకు వర్సిటీలో నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ఆయన ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన వర్సిటీ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేవిధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఐఐటి హైదరాబాద్‌కు చెందిన TiHAN ఫౌండేషన్ మంజూరుచేసిన ఈ కార్యక్రమం రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో పాల్గొనే గిరిజన యువతకు రిజిస్ట్రేషన్ ఫీజులో పూర్తి మినహాయింపు కల్పించి ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన  ఐఐటి హైదరాబాద్, ట్రీపుల్​ఐటిడీఎం కర్నూలు అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా విద్యార్థులకు ఆచార్య బసవరావు సూచించారు.ఇప్పటికే డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని తయారుచేశామన్నారు. ప్రస్తుత స్టార్టప్ల యుగంలో 10 – 20 శాతం స్టార్టప్లు ఈ డ్రోన్ టెక్నాలజీపై పనిచేస్తున్నయన్నారు. ఈ రంగంలో అవసరమయ్యే విడిభాగాల ఉత్పత్తిపై దేశీయంగా పరిశోధన మరింతగా జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, కో కన్వీనర్ శరత్ మనోహర్ తో పాటు వివిధ శాఖల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author