పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మీని పరామర్శించిన గారపాటి చౌదరి, రెడ్డి అప్పల నాయుడు
1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన చైత్ర హాస్పిటల్ సిఈఓ కీ.శే ఈడ్పుగంటి నవరాజ్ కుటుంబ సభ్యులను ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి) పరామర్శించారు. బుధవారం తూర్పు వీధిలోని వారి నివాసంలో కీ.శే. ఈడ్పుగంటి నవరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి సతీమణి మాజీ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మీ ని ఓదార్చి వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్,నగర అధ్యక్షులు వీరంకి పండు,నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీ శంకర్ పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

