అల్లిపల్లి పుణ్యక్షేత్రం డైరెక్టర్, విచారణ కర్త రెవ,ఫా:మరియ జోజి జన్మదిన వేడుకలు
1 min read

శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పలువురు ఆర్చ్ బిషప్ లు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి మండలం అల్లిపల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు విచారణకర్తలు రెవ,ఫా:మరియజోజి జన్మదినోత్సవ వేడుకలొ ఢిల్లీ, ఏలూరు, విజయనగరం బిషప్ గార్ల తో కలసి పాల్గొన్న చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లొ రెవ. ఫా:మరియజోజి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఏలూరు బిషప్ శ్రీ శ్రీ శ్రీ జయరావు పొలిమేర కి సన్మానం చేసి అయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేరీ మాత నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసన సభ్యులకు ఢిల్లీ, ఏలూరు,విజయనగరం బిషప్ లు,ఫాథర్స్, కన్య స్త్రీలు, ఉపదేసులు,కూటమి నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.


