NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశంలో పరిశ్రమలు స్థాపనకు మన ఏపీ లోనే మంచి సదుపాయాలు ఉన్నాయి

1 min read

దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ఏపీ అభివృద్ధి సాధిస్తోంది

20 నెలల్లో నూజివీడు నియోజకవర్గంలో రూ 250 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో బుధవారం స్థానిక నాయకులు మాదాల బుజ్జి స్వగృహంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని  స్టీల్ సిటీ నిర్మాణం కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని అన్నారు. రూ 1.35 లక్షల కోట్ల పెట్టుబడిగా జరిగే స్టీల్ ప్లాంటుకు యువతీ, యువకులకు ఒక 1 లక్షకు పైగా ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్రానికి 9 శాతం ఆదా ద్వారా రూ 12 వేల కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. AM-NS ఇండియా ప్లాంట్  దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం చాలా మంచి పరిణామమని, అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపకరిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నామని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపు తున్నామని, రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరుందని ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి శుభపరిణామం అన్నారు. పోలవరం నుండి మీర్జాపురం వరకు లిఫ్టు ఇరిగేషన్ ద్వారా నీళ్లు తెచ్చుటకు నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అధిక వర్షాలు సమయంలో 57 అంశాలుపై 57 లక్షలు మంది రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై సకాలంలో సమాచారాన్ని అందించగలిగామని దీనివలన కొంత నష్టాన్ని తగ్గించుకోగలిగారని తెలిపారు.ఈ పాత్రికేయుల సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు, పాల్గొన్నారు.

About Author