NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

1 min read

జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి..

న్యూస్ నేడు నందికొట్కూరు:  ఏఐటియుసి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు వి రఘురాం మూర్తి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఏప్రిల్ 6,7 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పగిడ్యాలలో కరపత్రాలను విడుదల చేశారు.​ఈ సందర్భంగా రఘురాం మూర్తి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు.​లేబర్ కోడ్స్ రద్దు, దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి,వాటిని కేవలం 4 లేబర్ కోడ్ లుగా మార్చడం కార్మిక హక్కులను కాలరాయడమేనని అన్నారు వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పని గంటల పెంపు:రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను 8 నుండి 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమని ఇది కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నమని ధ్వజమెత్తారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య కార్మికుడి సంక్షేమాన్ని విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు.మహాసభల లక్ష్యం: కార్మికులకు మెరుగైన వేతనాలు,పని భద్రత, మరియు సామాజిక రక్షణ కల్పించడంతో పాటు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,55 సం.లు కలిగిన హమాలీ కార్మికులకు సామాజిక పించన్ రూ 8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.నందికొట్కూరులో జరిగే జిల్లా మహాసభలకు కార్మికులు, రైతులు,ప్రజా సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చాంద్ భాష,కళ్యాణ్,అబ్దుల్ రెహమాన్,దేవన్న,శాలుభాష పాల్గొన్నారు.

About Author