NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆపరేషన్ వజ్రప్రహార్”తో హోళగుందలో డ్రగ్స్‌పై పోలీసుల గట్టి దాడి

1 min read

మెగా కార్డన్ సెర్చ్… 125 బైకులు స్వాధీనం — నిబంధనలు ఉల్లంఘనపై చర్యలు

హోళగుందలోని పోలీసుల మెగా కార్డన్ సెర్చ్

సరైన పత్రాలు లేని 125 బైకులు స్వాధీనం

డ్రగ్స్‌కు నో చెప్పండి  యువతకు పోలీసుల కౌన్సెలింగ్ మరియు ప్రతిజ్ఞ

హోళగుందన్యూస్ నేడు : హోళగుందలో ఆపరేషన్ వజ్రప్రహార్” — డ్రగ్స్‌పై పోలీసుల మెగా కార్డన్ సెర్చ్ మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా హోళగుంద మండల కేంద్రంలో పోలీసులు శనివారం భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ కార్డెన్ సెర్చ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.ఉదయం వేళల నుంచే పోలీసు బలగాలు గ్రామంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని మొత్తం 125 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు కలిగి ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని పోలీసులు అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువకులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్న పోలీసులు, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్, ఈగల్ టీం సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

About Author