ఏప్రిల్ 1 నుండి 7 వరకు కర్నూలు పేట శ్రీరామాలయము 101వ బ్రహ్మోత్సవాలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలోని మెయిన్ బజార్ శ్రీ రామాలయపు 101వ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విలేకరుల సమావేశం 28 మార్చ్ 2026 ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం జరిగింది శ్రీ రామాలయం ప్రధాన అర్చకులు మాళిగి హన్మేశాచార్యులు విలేకరులు ఉద్దేశించి ప్రసంగిస్తూ అనేక విషయాలు తెలిపారు .వారు మాట్లాడుతూ “పవిత్ర తుంగభద్రా నదీపరివాహక ప్రాంతమైన కర్నూలు నగరంలో పేట శ్రీ రామాలయం ప్రాచీన, ప్రసిద్ధదేవస్థానము. 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఏకశిలా రూపంలోనే శ్రీ సీతారాములు ఉండడం విశేషం. ప్రతి ఏటా చైత్ర పున్నమి నుండి సప్తరాత్రోత్సవాల పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. గత సంవత్సరం శతాబ్ది (100వ) బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే 101వ బ్రహ్మోత్సవాలకు శ్రీరామ భక్తులందరికీ సాదర ఆహ్వానం. ఏడు రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచామృతాభిషేకాలు ,శ్రీ సీతారాముల వారికి పూజా దికాలు , నైవేద్యాలు,రాత్రిపూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనోత్సవాల తో పాటు వివిధ రకాల హోమాలు జరుగుతుంటాయి .ప్రతిరోజు బ్రాహ్మణ “అన్న సంతర్పణ” తో సాయంకాలం వివిధ సంస్థల సౌజన్యంతో రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయబడినదనీ అయిదవ రోజు అనగా ఏప్రిల్ 5 తేదీ ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం సాయంకాలం దివ్య మంగళ రథోత్సవం వైభవంగా నిర్వహింపబడుతుందని, పై జరిగే అన్ని కార్యక్రమాలలో సద్భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రులు కాగలరని మనవి.” అని తెలిపారు. ఈ సమావేశంలోని సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ విట్టల్ శెట్టి ఈ రామాలయంలో 13 అడుగుల రాములవారి విగ్రహం యొక్క ప్రాశస్త్యాన్ని 13 అక్షరాల విజయమహామంత్రం గురించి తెలిపారు . బ్రహ్మోత్సవాల కార్యక్రమాల గురించి ఆలయ కార్యనిర్వాహణాధికారి దినేష్ తెలియజేశారు. వీరితో పాటు శ్రీ ఎం భాను ప్రకాష్, ఉపేంద్ర నాయక్, సతీష్ , రాఘవేంద్ర , నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

