ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి టీజీవీ సంస్థల నుంచి కోటి రూ. విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: విజయవాడలో నిర్మిస్తున్న నూతన ఆర్యవైశ్య మహాసభ భవనానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా టీజీవి సంస్థల నుంచి రూ.50 లక్షల చెక్కును.. ఆర్యవైశ్య మహాసభకు ఇచ్చారని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య తెలిపారు. గతంలో కూడా ఈ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలు ఈ భవన నిర్మాణానికి టీజీవీ సంస్థల నుండి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ గుప్తాకి వీరు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎప్పుడూ అండగా ఉంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ దోమ జగదీష్ గుప్తా, ఇల్లూరు తిరుపాల్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిశెట్టి నవీన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, ఆర్యవైశ్య సంఘ నాయకులు నాగిళ్ల రాజగోపాల్, ఇల్లూరు సుధాకర్, వాయిగండ్ల సుబ్బారావు, విట్టల్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

