NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం పరీక్షల ఫలితాల విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో డిసెంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ మరియు పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. మహబూబ్ బాషా ప్రకటించినట్లు తెలిపారు.వివరాల ప్రకారం, డిగ్రీ మూడవ మరియు ఐదవ సెమిస్టర్, అలాగే పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. విడుదలైన ఫలితాలలో ఎం.ఏ ఉర్దూ, ఎం.ఏ ఇంగ్లీష్, ఎం.ఏ ఎకనామిక్స్, ఎం.ఎస్‌సి కంప్యూటర్ సైన్స్, ఎం.ఎస్‌సి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఎం.ఎస్‌సి జూలజీ, ఎం.ఎస్‌సి బోటనీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ తో పాటు బి.ఏ ఉర్దూ మరియు బి.ఏ ఎకనామిక్స్ పరీక్షల విడుదల చేసినట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. మహబూబ్ బాషా పేరుకొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.ahuuk.ac.in నుండి పొందగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగానికి చెందిన ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇర్ఫాన్, సైన్స్ కోఆర్డినేటర్ డా. నబియా సుల్తానా, ఆర్ట్స్ కోఆర్డినేటర్ డా. బి. వెంకటప్ప మరియు విశ్వవిద్యాలయం పి.ఆర్.ఓ డా. జే. మహమ్మద్ షఫీ పాల్గొన్నారు. అలాగే సిబ్బంది బి. మురళి మరియు లావణ్య కూడా పాల్గొన్నారు.

About Author