NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రారంభమైన శ్రీ కలబురగి శరణు బసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమం

1 min read

హోలగుంద న్యూస్ నేడు: మండల కేంద్రంలో కొండ గుహలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ 20న బసవ జయంతిని పురస్కరించుకుని మంగళవారం శ్రీ కలబురగి శరణు బసవేశ్వర స్వామి పురాణ ప్రవచన కార్యక్రమం వంశపారంపర్య ఆలయ ధర్మ రాజపంపన్న గౌడ,శివశంకర్ గౌడ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.ముందుగ జంగమర వసలి శ్రీ శ్రీఅజాత శంభు లింగ శివాచార్యులు స్వాములు జ్యోతి ప్రజ్వలన చేసి పురాణ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 6:30 గంటలకు పురాణం ప్రవచన కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.ముఖ్యంగా పురాణ ప్రవచన కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కావున సకల భక్తులు ప్రతి రోజు పురాణ ప్రవచన విశ్వనాథ స్వామి పురాణ గవాయిలు నాగేష్ తబలవాది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author