NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకే రాజధాని,అభివృద్ధి కేంద్రీకరణ కూటమి ప్రభుత్వం ధ్యేయం.. శాసనసభ్యులు

1 min read

పెనమలూరు, న్యూస్​ నేడు:  నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ,పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరులతో సమావేశం నిర్వహించారు… సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్  మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కలలు కన్నా ఒకే రాజధాని అమరావతిని ఏపీ క్యాబినెట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం చేసి తీర్మానంచి, కేంద్రంలో ఆమోదించి పార్లమెంట్లో బిల్లును పాస్ చేయడానికి ప్రవేశపెడుతున్నామన్నారు…ఐదు కోట్ల ఆంధ్రుల కలల కన్నా రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు రాజముద్ర వేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.తమిళనాడు,కర్ణాటక,హైదరాబాద్ రాష్ట్రాల రాజధానులకు దీటుగా అమరావతిని కూటమి ప్రభుత్వం తీర్చిదిద్ది,13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరుగా మారుస్తున్నామన్నారు.గత ఐదు సంవత్సరాలు కక్ష పూరిత,చేతకాని పాలన వల్లే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 34 వేల ఎకరాలు భూమిని సద్వినియోగపరచకుండా రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రణాళిక బద్ధంగా అమరావతిని అభివృద్ధి చేస్తూ, పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మార్చడంతో సుమారు 16 జాతీయ సంస్థలు కార్యాలయాలకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు…అమరావతి రాజధానికి భూ సమీకరణ ఒక చారిత్రాత్మక ప్రజా ఉద్యమం అన్నారు.జనవరి 2015 లో భూ సమీకరణ పథకానికి సి ఆర్ డి ఏ రూప కల్పన చేసి కేవలం 90 రోజుల్లోనే 28,538 రైతుల వద్ద నుంచి స్వచ్ఛందంగా తీసుకున్నారు అన్నారు..రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమి వారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చేసిన త్యాగం అన్నారు.రైతులు చేసిన త్యాగాలు వృధా కాకుండా శాశ్వత రాజధాని వేగవంతంగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్  రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్  తాడిశెట్టి వీరస్వామి పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనందప్రసాద్ బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు బొంగరాల అబ్రహం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author