NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్పొరేటర్లకు ఊడిగం చేసేందుకే నాలుగు లేబర్ కోడ్ల అమలు 

1 min read

సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర 

న్యూస్ నేడు, పత్తికొండ:  కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర ఆరోపించారు. పత్తికొండ స్థానిక సివిల్ సప్లై ఎం ఎల్ ఎస్  పాయింట్ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్ల అమలకు వ్యతిరేకంగా హమాలీలు బుధవారం బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై గోడౌన్ హమాలీ సంఘం అధ్యక్షులు చిన్న హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు లేబర్ కోడ్ల అమలు చేస్తున్న సందర్భంగా సివిల్ సప్లై గోడౌన్ హమాలి వర్కర్స్ మార్కెట్ యాడ్ అమాలీలు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు ఊడిగం చేసేందుకే నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడానికి పూనుకున్నదని, ఈ ధోరణికి కార్మికుల ఉనికికే గొడ్డలి పెట్టు అని అన్నారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు ఏవి ఈ దేశంలో నిలిచిన దాఖలాలు లేవన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు నిర్ణయంతో నరేంద్ర మోడీ కార్మిక ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడం, ప్రశ్నించే హక్కు లేకుండా చేయడం, ఎనిమిది గంటల పని విధానం రద్దు చేసి, 13 గంటల పని విధానాన్ని తీసుకురావడం ఇవన్నీ బ్రిటీషర్ల పాలనను తలపిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి పదాన నడవాల్సిన భారతదేశం బ్రిటిష్ కాలానికి తీసుకుపోతున్నట్టుగా ఉందని, బానిసత్వం పెత్తందారి వ్యవస్థను పెంచి పోషించడానికి ఇలాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

About Author