NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్ వచ్చింది పండగ తెచ్చింది..

1 min read

దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు  రూ.15కోట్ల62లక్షలు పంపిణీ

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరు, న్యూస్​ నేడు:  దెందులూరు నియోజకవర్గంలో  పండగ వాతావరణం లో బుధవారం తెల్లవారుఝాము నుంచే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమం – పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు.దెందులూరు నియోజకవర్గం లోని 35,127 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.15కోట్ల 62లక్షల 48వేల500 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల రూపేన అందిస్తున్న కూటమి ప్రభుత్వం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ గ్రామాన  కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు సంబంధిత అధికారులు సిబ్బంది.

About Author