NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చేనేతలకు ఉచిత విద్యుత్:ఎమ్మెల్యే

1 min read

చెరుకుచెర్ల’లో పింఛన్ల పంపిణీ..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఏప్రిల్ 1వ తేదీ నుండి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో బుధవారం ఉదయం పాణ్యం శ్రీనివాసులు చేనేత కుటుంబానికి వెళ్లి చేనేత చేయుట గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం సరికొత్త వెలుగులు నింపుతోందని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేనేతలకు ‘ఉచిత విద్యుత్’ పథకంపై చేనేతలకు సరికొత్త వెలుగులంటూ చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు,మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల చేనేతలకు వర్తిస్తుందని అన్నారు.ముందుగా చెరుకుచెర్లలో జోగులాంబ సమేత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ధ్వజ ప్రతిష్టలో పాల్గొన్నారు.తర్వాత వివిధ రకాల పింఛన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.షబానకు- 32,114 రూ.లు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు.తర్వాత పాములపాడు మండలం ఇస్కాలలో శ్రీ జంబులా పరమేశ్వరి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, వంగాల శివరామరెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు,కడియం వెంకటేశ్వర్లు యాదవ్,మాజీ సర్పంచ్ స్వామి రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి, వీరారెడ్డి వీఆర్వోలు బాలన్న, వెంకటయ్య పాల్గొన్నారు.

About Author