NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊరి బడిని  కాపాడుకుందాం…ప్రధానోపాధ్యాయులు ,శివయ్య

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బావిపల్లిలో 9 వ తరగతి చదువుతున్న బాలికలు వచ్చే విద్యాసంవత్సరం 10 వ తరగతికి వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బావిపల్లి లో ఆ పిల్లల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగినది.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివయ్య మాట్లాడుతూ బావిపల్లి పాఠశాలలో చదువుకున్న 9 వ తరగతి విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరం మన పాఠశాలలోనే 10 వ తరగతి చదువుతారని ఇప్పుడు మన గ్రామంలో పూర్తిగా ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు పాఠశాల ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపవద్దని,మంచి ఉపాధ్యాయులు ఉన్నారని,మంచి బోధన కొనసాగిస్తున్నామని అన్నారు.పాఠశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన గ్రామస్తులు సతీష్ గారు మరియు డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ గారు పాఠశాలలకు 25 వేల రూపాయల విలువైన ప్రింటర్ ను అందచేశారు.పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగినది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణ,మదన గోపాల్,మద్దిలేటి,ఇబ్రహీం,మద్దయ్య నాయుడు,సుమలత,శివ ప్రసాద్,మాబు సుబహాన్,షమీనా బీ ,గ్రామస్తులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.కాపాడుకుందాం….ప్రధానోపాధ్యాయులు ,శివయ్యపలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బావిపల్లిలో 9 వ తరగతి చదువుతున్న బాలికలు వచ్చే విద్యాసంవత్సరం 10 వ తరగతికి వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బావిపల్లి లో ఆ పిల్లల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగినది.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివయ్య మాట్లాడుతూ బావిపల్లి పాఠశాలలో చదువుకున్న 9 వ తరగతి విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరం మన పాఠశాలలోనే 10 వ తరగతి చదువుతారని ఇప్పుడు మన గ్రామంలో పూర్తిగా ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు పాఠశాల ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపవద్దని,మంచి ఉపాధ్యాయులు ఉన్నారని,మంచి బోధన కొనసాగిస్తున్నామని అన్నారు.పాఠశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన గ్రామస్తులు సతీష్  మరియు డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ గారు పాఠశాలలకు 25 వేల రూపాయల విలువైన ప్రింటర్ ను అందచేశారు.పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగినది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణ,మదన గోపాల్,మద్దిలేటి,ఇబ్రహీం,మద్దయ్య నాయుడు,సుమలత,శివ ప్రసాద్,మాబు సుబహాన్,షమీనా బీ ,గ్రామస్తులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *