ప్రతిరోజు ఎఫ్ ఆర్ ఎస్ టైం ప్రకారం విధులు నిర్వహించాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ నందు మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ వారికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్ అధ్యక్షత వహించి సమావేశము నిర్వహించి నారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 65 పరీక్షలు చేయాలని ప్రతిరోజు ఎఫ్ ఆర్ ఎస్ టైం ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి కి సంబంధించి రికార్డులు మెయింటైన్ చేయాలని మరియు వచ్చిన వారందరికీ ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు మరియు పి ఐ డి అనగా పర్సనల్ ఐడెంటిఫికేషన్ డిజిట్స్ వారి డిజిటల్ నంబర్ మైంటైన్ చేయాలి అని తెలియజేశారు. మరియు ఎల్ ఫామ్ ను మూడు గంటల లోపల ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. టీబీకి సంబంధించి పరీక్షలు చేస్తూ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని తెలిపారు. మరియు మలేరియా కు పరీక్షలు 50% కలెక్షన్స్ ఖచ్చితంగా చేయాలి అని తెలిపారు. మరియు డెంగ్యు లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సర్వేలియాన్స్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి ,NMO డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి నూకరాజు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ పాల్గొన్నారు.

