NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో.. ‘ మెడికవర్​ ’ ఇండియా సీఈఓ

1 min read

 కర్నూలు , న్యూస్​ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిళంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం  మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా సీఈఓ హరి కృష్ణ దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు రమేష్​ స్వామి  మెడికవర్​ ఇండియా సీఈఓ  హరి కృష్ణ కు  సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ హరి కృష్ణ మాట్లాడుతూ  అహోబిళం లక్ష్మీ నరసింహ స్వామి  దర్శనం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించిందన్నారు.  సమాజ ఆరోగ్య సేవల రంగంలో విశేష సేవలందిస్తున్న మెడికవర్​ హాస్పిటల్​ ఇండియా సంస్థ  ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ఆశీర్వదించాలని దేవున్ని కోరినట్లు సీఈఓ హరి కృష్ణ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *