NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దంతాల ఆరోగ్యమే మహాభాగ్యం..

1 min read

చిగుళ్ల ఇన్​ఫెక్షన్​ ఉంటే.. త్వరగా క్లియర్​ చేసుకోండి..

  • నశీం,లవంగాలతో తాత్కాలికంగా నొప్పి తగ్గొచ్చు…
  • కానీ చికిత్స తప్పనిసరి..
  • దంత వైద్య నిపుణులు డా. యశ్వంత్​ శ్రీధర

కర్నూలు హాస్పిటల్​, న్యూస్​ నేడు:గ్రామీణ ప్రాంతాల ప్రజలు దంతాల సమస్యను త్వరగా పట్టించుకోరని, దీంతో చిగుళ్ల ఇన్​ ఫెక్షన్​, పంటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు దంత వైద్య నిపుణులు డా. యశ్వంత్​ శ్రీధర. ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ‘ ప్రీవెంటివ్​ డెంటిస్రి ’ పై అవగాహన సదస్సు నిర్వహించారు.  డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి దంత వైద్య నిపుణులు డా. యశ్వంత్​ శ్రీధర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  రెండేళ్ల చిన్నారికి కాటన్​ తో పళ్లను శుభ్రం చేయాలని, ఆ పై చిన్నారులకు బ్రష్​ తో శుభ్రం చేయించాలని సూచించారు. గ్రామాల్లో కొందరు పంటి సమస్యతో తీవ్రంగా సతమతమవుతుంటారని, కానీ వారు నశీం తిక్కడం, లవంగ పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారని, అలాంటి వాటి వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గవచ్చని, కానీ సమస్య మరింత జఠిలమవుతుందన్నారు.  ఒక దంతం ఊడిపోతే… దాని స్థానంలో మరో  కృత్రిమ పన్ను పెట్టుకోవాలని, లేదంటే మిగతా పళ్లు బిగువును కోల్పోతాయన్నారు.  కొందరికి బ్రష్​ చేసే సమయంలో రక్తం రావడం, మరికొందరికి దుర్వాసన వస్తుందని,  అలాంటి వారికి పంటి వ్యాధి ఉందని గుర్తించాలన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి దంత వైద్య నిపుణులను సంప్రదిస్తే… పళ్లను ఆరోగ్యంగా కాపాడుకోవని  ఈ సందర్భంగా దంత వైద్య నిపుణులు డా. యశ్వంత్​ శ్రీధర స్పష్టం చేశారు.

డా. యశ్వంత్​ శ్రీ ధర కు ఘన సన్మానం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరోగ్యం, వివిధ వ్యాధులపై అవగాహన సదస్సులను విజయవంతంగా నిర్వహించే ఏకైక స్వచ్ఛంద సంస్థ … హార్ట్​ ఫౌండేషన్​ అనే చెప్పవచ్చని  దంత వైద్య నిపుణులు డా. యశ్వంత్​ శ్రీధర్​ వెల్లడించారు. ప్రముఖ కార్డియాలజిస్టు, డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ , కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు, మెడికల్​ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల పలు సలహాలు, సూచనలు ఇవ్వడం గొప్పవిషయమన్నారు.  అంతకు ముందు  వీసీ డా. చంద్ర శేఖర్​ మాట్లాడుతూ  రాష్ట్రంలోని వివిధ వ్యాధుల వైద్య నిపుణులు పిలిచిన వెంటనే వచ్చి.. ప్రజలకు, మెడికల్​ విద్యార్థులకు  ఆరోగ్యంగా ఉండేందేకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారని చెప్పారు. 23 ఏళ్లగా కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ద్వారా ఎన్నో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్​ గుర్తు చేశారు. ఆ తరువాత డా. యశ్వంత్​ శ్రీధర ను డా. చంద్ర శేఖర్​, కమిటీ గౌరవా అధ్యక్షుడు  చంద్ర శేఖర్​ కల్కూర, కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

About Author