NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భవన నిర్మాణ కార్మికులకు క్లైమ్ బకాయిలు చెల్లించాలి

1 min read

సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర

న్యూస్ నేడు పత్తికొండ  : భవన నిర్మాణ కార్మికులకు 2020 సెప్టెంబర్ 7వ తేదీ నుండి క్లైమ్  చేసుకున్న వారందరికీ బకాయిలు చెల్లించాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సోమవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తాసిల్దార్ హుస్సేన్ సాహెబ్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి రాజు, అధ్యక్షతన వహించగా సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్స్ కు వెల్ఫేర్ ద్వారా 2020 సెప్టెంబర్ 7 నుండి క్లెయిమ్ చేసుకున్న వారందరికీ బకాయిలు చెల్లించాలని కార్మికులకు సంక్షేమ పథకాలన్నీ యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్ఫేర్ సంక్షేమ బోర్డు లో వేల కోట్లు ఉన్నా పాలకులు మాత్రం కార్మికులను పట్టించుకోవడంలేదని పోరుగు రాష్ట్రాల్లో ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలను ఇస్తున్నారని మన రాష్ట్రంలో పాలకులు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ఉన్న నిధులను కూడా బుట్ట దాఖలు చేసే పరిస్థితి కనపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఫ్రూటీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులను చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్, భవన  నిర్మాణ కార్మికులు రాజు కాశి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *